చీపురుపల్లి: వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు.
మహాత్మా... మా గోడు వినవయ్యా..
విజయనగరం గంటస్తంభం: మహాత్మా.. మా గోడు వినవయ్యా అంటూ స్కీమ్ వర్కర్లు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా విజయనగరం పెద్ద చెరువు గట్టు వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్మదర్శి టి.వి.రమణ మాట్లాడుతూ.. ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, పాఠశాల ఆయాల సమస్యలను ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రూ.10 లక్షల ప్రమాద బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావు, నాయకులు బి.సుధారాణి, మహాలక్ష్మి, ప్రభ, సుశీల, కుమారి, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాప్తిలో
విజయనగరం రెండోస్థానం
● మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
బొండపల్లి: రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాప్తి, రోగుల సంఖ్యలో విజయనగరం జిల్లా రెండవ స్థానంలో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాసర్ తెలిపారు. రైతులు ఆరోగ్యకర పంటలు సాగుచేయాలని సూచించారు. మండలంలోని బి.రాజేరులో రూ. 60.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో రీసర్వే పూర్తయిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గొల్లుపాలెం వెటర్నరీ ఆస్పత్రిలో వైద్యుడు లేక పశువులకు వైద్యసేవలు అందడంలేదని, ప్రత్యామ్నయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ప్రస్తుతం అందుబాటులో లేవని పలువురు రైతులు చెప్పగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుధాసాగర్, ఇన్‌చార్జి తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీఓ అరసాడ రఘుపతిరావు, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు చల్లా చలం నాయుడు, బండారు బాలాజీ, రాపాక అచ్చిం నాయుడు, కోరాడ కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


