సర్కారు డప్పు | - | Sakshi
Sakshi News home page

సర్కారు డప్పు

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

సర్కారు డప్పు

జనం డబ్బు

వలంటీర్లకు పంగనామం

గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు స్థాయి ప్రజలకు అండ గా నిలిచి, సంక్షేమ పథకాల ను ఇంటింటికీ చేర్చిన వలంటీర్లకు కూటమి ప్రభుత్వం పంగనామం పెట్టింది. నిరుద్యోగులను చేసింది. ఇప్పుడు అదే స్థానంలో ఎలాంటి విద్యార్హత, సేవాభావం లేని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో సొంతడబ్బా కొట్టించుకునేందుకు రూ.లక్షల ప్రజాధనం చెల్లించించడం సిగ్గుచేటు. ప్రజాసేవ చేసిన వారిని తీసేసి, ప్రభుత్వ భజన చేసేవారికి ప్రజాధనాన్ని దోచిపెట్టడం కూటమి ప్రభుత్వ అసమర్ధత, అరాచకపాలనకు నిదర్శనం.

– వావిలపల్లి నారాయణరావు, మాజీ

వలంటీర్‌, కొండగూడెం, సంతకవిటి మండలం

దగా చేశారు

ఎన్నికల హామీల్లో తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించమే కాకుండా నెలకు రూ. 10 వేలు ఇస్తామని హామీనిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మా ఉద్యోగాలనే తీసేంది. పవన్‌కల్యాణ్‌ సైతం గ్రామ వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. గెలిచిన వెంటనే మాటమార్చారు. సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లను పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం.

– గంగిరెడ్ల శివప్రసాద్‌, సారిక గ్రామం,

విజయనగరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement