గాంధీజీ ఆశయాలు ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ ఆశయాలు ఆచరణీయం

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

● కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో బాపూజీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి

జయంతి

● నివాళులర్పించిన కలెక్టర్‌, ఎస్పీ

విజయనగరం గంటస్తంభం/విజయనగరం టౌన్‌: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి, సత్యం, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని, శాంతి మార్గంలో స్వాతంత్య్రపోరాటం చేసిన మహనీయుడు గాంధీజీ అని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ అన్నారు. గాంఽధీ, మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జయంతిని కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల్లో శుక్రవారం నిర్వహించారు. గాంధీజీ విగ్రహాలకు లాల్‌బహుదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు మూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర సాధనలో వారి కృషిని గుర్తుచేశారు. వారి అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఏఆర్‌ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్‌, డీపీఓ ఏఓ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌, సిబ్బంది కలెక్టరేట్‌లో గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, జేసీ, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement