రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

చీపురుపల్లి: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో జరగనున్న రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయిలో జరిగిన అండర్‌–14, అండర్‌–17 విభాగాల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 12 మంది విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో వారిని పాఠశాల హెచ్‌ఎం రెహనా బేగంతో బాటు వ్యాయామ ఉపాధ్యాయురాళ్లు ఉషారాణి, అనురాధలు అభినందించారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో అక్టోబర్‌ 1న జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో బాలికోన్నత పాఠశాలకు చెందిన 12 మంది బాలికలు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచారు. దీంతో త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు రేపు

పాలకొండ రూరల్‌: ఏపీ అంతర్‌ జిల్లాల 36వ జూనియర్‌ బాల, బాలికల కబడ్డీ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్య జరుగుతాయని సంబంధిత అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు పల్లా కొండలరావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ పోటీల్లో పాల్గొనదలచిన ఔత్సాహిక క్రీడాకారుల పార్వతీపురం మన్యం జిల్లా జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 4న పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలురు 60 కేజీలు, బాలికలు 55 కేజీల బరువు, ఎంపిక పోటీల నాటికి 16 లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని సూచించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు మాత్రమే తమ ఒరిజినల్‌ ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలతో 4వ తేదీన ఉదయం 7 గంటలకు క్రీడా ప్రాంగణానికి హాజరుకావాలని కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు, సీనియర్‌ కోచ్‌ కె.సుదర్శనరావు తెలిపారు. ఇప్పటికే స్థానిక క్రీడాకారులకు తర్ఫీదు అందిస్తున్నట్లు కార్యదర్శి వెన్నపు చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్‌ 9948066185, 9603305767,9989691897 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

8 మద్యం సీసాలు స్వాధీనం

పూసపాటిరేగ: భోగాపురం మండలం కవులవాడలో 8 అనధికార మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు భోగాపురం ఎకై ్సజ్‌ సీఐ వి.రవికుమార్‌ శుక్రవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ అనధికార మద్యం దుకాణాలు నిర్వహించరాదని మద్యం బెల్టుషాపులను ప్రోత్సహించరాదన్నారు. అనధికార మద్యం దుకాణాల వద్ద మద్యం కొనుగోలు చేయవద్దని సూచించారు. అనధికార మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి మద్యం తాగితే అనారోగ్యం పాలవుతారని హెచ్చరించారు. ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై చంద్రమోహన్‌, హెడ్‌కానిస్టేబుల్స్‌ ప్రతాప్‌, రామారావు, కానిస్టేబుల్స్‌ సూర్యనారాయణ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement