గల్లంతైన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన వ్యక్తి మృతి

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

గల్లంతైన వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..

● నాలుగు రోజుల తర్వాత మృతదేహం లభ్యం

వీరఘట్టం: వీరఘట్టం మండలం పనసనందివాడ వద్ద నాగావళి నదిలో పడవ నడుపుతున్న పాలకొండ సుబ్బారావు (55) అనే వ్యక్తి గత నెల 29న ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజులుగా రెవెన్యూ, పోలీసులు, ఫైర్‌ అధికారులు సుబ్బారావు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం బూర్జ మండలం లాభాం వద్ద నాగావళి నది ఒడ్డుకు ఓ మృతదేహం చేరినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, బంధువులు వచ్చి అది సుబ్బారావు మృతదేహమేనని గుర్తించారు. వెంటనే గ్రామస్తుల సహకారంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు మృతేదేహాన్ని అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

విజయనగరం టౌన్‌: స్థానిక ఎస్పీ బంగ్లా దాటిన తర్వాత టర్నింగ్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తోటపాలానికి చెందిన డి.రామ్మోహనరావు (56) ఎలక్ట్రీషీయన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన కుమార్తెకు మధ్యాహ్నం క్యారేజీ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ఎస్పీ బంగ్లా దాటిన తర్వాత టర్నింగ్‌ తిరిగినప్పుడు అదుపుతప్పి పొరపాటున తన టీవీఎస్‌ ఎక్సెల్‌తో గోడను ఢీకొట్టాడు. అక్కడ పిల్లర్‌ కోన్‌కు తలభాగం గట్టిగా తగలడంతో తీవ్రరక్తస్రామైంది. స్థానికులు వెంటనే జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయనకు భార్య ప్రభావతి, ఇద్దరు పిల్లలున్నారు. మృతుని సోదరుడు జనార్దనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ ఎస్సై ఎస్‌.రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement