పల్టీ కొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

పల్టీ కొట్టిన కారు

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

పల్టీ కొట్టిన కారు

పూసపాటిరేగ: మండలంలోని కోనాడ జంక్షన్‌ సమీపంలో జాతీయరహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో కారు పల్టీలు కొట్టి సుమారు 50 అడుగుల దూరంలో ఎగిరి పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఉదయం 9 గంటల సమయంలో కారులో తమ స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి కుటుంబంతో గున్న రామానందం, భార్య గున్న లక్ష్మీభాయి, కుమార్తె గున్న శృతి కాత్యాయిని, కుమారుడు వెంకటసాయి సుమంత్‌లు బయల్దేరారు. పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్‌ సమీపంలో జాతీయరహదారిపై వచ్చేసరికి కారు ముందు టైర్‌ పంక్చరై పేలిపోవడంతో డివైడర్‌ను ఢీకొని రోడ్డు రెయిలింగ్‌ దాటి సుమారు 50 అడుగుల దూరంలో కారు పడింది. దీంతో వెనకసీటులో వున్న లక్ష్మీభాయి తలకు తీవ్రగాయమై రక్తస్రావం అయింది. కుమార్తె శృతికాత్యాయిని తలకు బలమైన గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళలను విజయనగరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ డైరెక్టర్‌గా రామానందం పనిచేస్తున్నారు. కుమార్తె శృతికాత్యాయని హామియోపతి డాక్టర్‌ కోర్సు పూర్తిచేశారు. కుమారుడు వెంకటసాయిసుమంత్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఈ మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement