జూనియర్స్‌ ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జూనియర్స్‌ ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

జూనియర్స్‌ ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

● 16 నుంచి 18 వరకు కృష్ణా జిల్లాలో పోటీలు

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్‌ బాల, బాలికల ఖోఖో చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు గురువారం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కస్పా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు జిల్లా నలు మూలల నుంచి 200మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంపిక పోటీలు నిర్వహించి..ఉత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది బాలురు, 18 మంది బాలికల క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులకు కోచింగ్‌ క్యాంప్‌ నిర్వహించిన అనంతరం తుది జట్టును ఖరారు చేయనున్నటట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఏఎన్‌ఎం కమలనాభరావు, కె.గోపాల్‌లు తెలిపారు. తుది జట్టులో స్థానం సాధించిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు కృష్ణా జిల్లా కంచికచర్లలో జరగబోయే అంతర్‌ జిల్లాల బాల, బాలికల ఖోఖో పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల కార్యక్రమంలో భగవాన్‌దాస్‌ ట్రస్ట్‌ కార్యదర్శి రంగారావుదొర, మాజీ జిల్లా కార్యదర్శి చిన్నంనాయుడు, స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శులు వాణిశ్రీ, శ్రీనివాసరావు, పీడీలు బాలకృష్ణ, సత్యనారాయణ, సోమేశ్వరి, ఆదిలక్ష్మి, అన్నపూర్ణ, కోశాధికారి ప్రసాద్‌, సీనియర్‌ క్రీడాకారులు హరీష్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement