అంతర్జాతీయ వైద్య వేదికపై ఎల్‌.కోట యువ డాక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వైద్య వేదికపై ఎల్‌.కోట యువ డాక్టర్‌

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

అంతర్జాతీయ వైద్య వేదికపై ఎల్‌.కోట యువ డాక్టర్‌

● భారతదేశం నుంచి ఇద్దరికే అవకాశం

లక్కవరపుకోట: న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక యశోభూమి(ఐఐసిసి) వేదికగా జరగుతున్న వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (డబ్ల్యూసీఓజీ–2027) అంతర్జాతీయ వైద్య వేదికపై పరిశోధన వ్యాసాన్ని లక్కవరపుకోట మండల కేంద్రానికి చెందిన యువ డాక్టర్‌ బూర్లె మహేష్‌ ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 61 పైగా దేశాలకు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు హాజరయారు. ఈ సదస్సులో మహేష్‌ పరిశోధన వ్యాసం ఎంపికై ంది. నోబెల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ బ్యారీ మార్షల్‌ సహా పలువురు ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో భారతదేశం నుంచి ఇద్దరు ఎంపిక కాగా అందులో ఒకరు ఢిల్లీ ఎయిమ్స్‌కి చెందిన వారు కాగా మరొకరు మహేష్‌(గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌) కావడం విశేషం. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎల్‌.కోట ప్రభుత్వ పాఠశాలలో చదివిన మహేష్‌ ఉన్నతస్థాయికి ఎదగడన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచించారు.ఈ ఘనత ఎల్‌.కోటకే గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయన తల్లిదండ్రులు అప్పలరాజు, జగన్నాథంలతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement