రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు పలువురి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు పలువురి ఎంపిక

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు పలువురి ఎంపిక

రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో పలు పాఠశాలలకు చెందిన 30 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ పోటీలను తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యరాలు అప్పికొండ సరస్వతి ప్రారంభించగా ఆరికతోట, రామభద్రపురం, కొట్టక్కి, ఎల్‌కోట,అలుగోలు, విజయనగరంలోని పువ్వాడ స్కూల్‌, వీటీ అగ్రహారం, బొబ్బిలి సంస్థానం, జోగింపేట తదితర 15 ఉన్నత పాఠశాలలకు చెందిన 120మంది క్రీడాకారులు అండర్‌ 14,17,19 విభాగాల్లో పాల్గొన్నారు. వారిలో 30 మంది బాల, బాలికలు రాష్ట్ర స్థాయి టెబుల్‌ టెన్నిస్‌ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కొట్టక్కి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వి.అప్పలనాయుడు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 10 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పెదవేమలిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ కార్యదర్శి నల్ల వెంకటనాయుడు,జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కృష్ణమూర్తి, జిల్లా జూడో అసోసియేషన్‌ ప్రతినిధి బొత్స రత్నకిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement