డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

విజయనగరం ఫోర్ట్‌:

వచ్చే ఏడాది నాటికి డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. డ్రగ్స్‌ నియంత్రణ అధికారులు మందుల షాపులను తనిఖీ చేపట్టి నిషేధిత డ్రగ్స్‌పై నిఘా పెట్టాలన్నారు. ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ మాట్లాడుతూ ఈగిల్‌ టీమ్‌, టాస్క్‌ఫోర్స్‌ సహకారంతో గంజాయి, మత్తు పదార్థాల రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌. జీవనరాణి తదితరులు పాల్గొన్నారు.

● కలెక్టర్‌

ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement