కపట నాటకాలు | - | Sakshi
Sakshi News home page

కపట నాటకాలు

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

కల్లబొల్లి

మాటలు..

సాక్షిప్రతినిధి, విజయనగరం:

హైకోర్టు తీర్పుతో బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ వ్యవహారం మరోసారి బట్టబయలయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన రెండు జీఓలు 105, 1065ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో 59 శాతం రిజర్వేషన్లను మించి ఇవ్వరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు స్పష్టంగా ఉన్నా సరే.. చంద్రబాబు బీసీలను వంచించేందుకే 34 శాతం రిజర్వేషన్ల డ్రామా ఆడారన్న విమర్శలు ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పించారు.

బీసీల రిజర్వేషన్లపై చంద్రబాబు నాటకం బట్టబయలు

సాధ్యం కాదని తెలిసీ ఎన్నికల డ్రామా

హైకోర్టు తీర్పుతో.. మళ్లీ సుప్రీం కోర్టు

అంటూ ఎన్నికల వేళ కొత్త పల్లవి

బాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement