మడ్డువలస గేట్లు మూసివేత | - | Sakshi
Sakshi News home page

మడ్డువలస గేట్లు మూసివేత

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం గేట్లు మూసివేశారు. ప్రాజెక్టు వద్ద 64.46 మీటర్ల నీటిమట్టం నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 2,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని, అవుట్‌ ఫ్లో పూర్తిగా నిలిపివేసినట్టు డీఈ పి.అర్జున్‌ తెలిపారు.

రేబీస్‌పై అవగాహన అవసరం

● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జీవనరాణి

విజయనగరం ఫోర్ట్‌: కుక్కల నుంచి సంక్రమించే రేబీస్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని డీఎంహెచ్‌ఓ ఎస్‌.జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ప్రపంచ రేబీస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కుక్క కరవడం వల్లనే కాదు, ప్రేమతో నాకినా చర్మంపై గీతలు, గాయాలు ఉంటే రేబీస్‌ సోకే ప్రమా దం ఉందన్నారు. వీధి, పెంపుడు కుక్కలకు యాంటీరేబీస్‌ వ్యాక్సినేషన్‌ వేయించడం తప్పనిసరన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎన్‌.సూర్యనారాయణ, డీఎన్‌ఎంఓ ఎ.అర్చనాదేవి, డీఎస్‌ఓ రఘువంశీ, ఎపిడిమాలజిస్ట్‌ లలిత, తదితరులు పాల్గొన్నారు.

30న యువజనోత్సవ పోటీలు

● కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం: విజయనగరం మహారాజా అటానామస్‌ కళాశాలలో ఈ నెల 30న ఉద యం 9 గంటలకు సెట్విజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి కోరారు. జానపద నత్యం (గ్రూప్‌), జానపద గీతం (గ్రూప్‌), నుక్కడ్‌ నాటక్‌/వీధి నాటకం (గ్రూప్‌), కవితా రచన, పెయింటింగ్‌ తదితర పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి 2027 జనవరి 12న జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని కలెక్టర్‌ వివరించారు.

నేటి నుంచి పల్లె పండగ 3.0

విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ 3.0 కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వివిధ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమన్వయసమావేశంలో సూచించారు.

వచ్చేనెల 3న చెరకు రైతుల నిరసన ర్యాలీ

రేగిడి: సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం పరిరక్షణ కోసం వచ్చేనెల 3న సంకిలి శివాల యం నుంచి వందలాది మంది రైతులతో ర్యాలీ నిర్వహిస్తామని ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రేగిడిలో సోమవారం ఆవిష్కరించారు. ర్యాలీలో చెరకు రైతులందరూ పాల్గొనా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతులు కె.రవిశంకర్‌, ఎం.వేణుగోపాలనాయుడు, జి.సూరపునాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement