విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న పారా వాలీబాల్ సీ్త్ర, పురుషుల పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్ల ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. జిల్లా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన ఎంపిక పోటీలకు వివిధ జిల్లాలకు చెందిన 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి ఎంపిక పోటీలు నిర్వహించగా... అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను పురుషుల జట్టులోకి, 14 మంది క్రీడాకారిణులను సీ్త్రల జట్టులోకి ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్‌లో జరిగే జాతీయ స్థాయి పారా వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి.శివదత్త, విజయనగరం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


