పూసపాటిరేగ: పూసపాటిరేగ కేజీబీవీని ఏపీ ఫుడ్‌కమిషన్ సభ్యుడు కాంతారావు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంపై జీసీడీఓకి ఫోన్‌చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంబారు తయారీలో నాణ్యత పాటించలేదని, విద్యార్థినులకు పెట్టాల్సిన అరటి పండ్లు సగం మందికే పెట్టడంతో సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం పూసపాటిరేగ బీసీ సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి పరిసరాలు అధ్వానంగా ఉండడంపై అసహనం వ్యక్తంచేశారు. అధ్వానంగా ఉన్న మరుగుదొడ్ల తలుపులు, విద్యార్థులకు అందజేయాల్సిన మంచాలు గదిలో వేసి తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డెన్ శ్రీదేవిని ఫోన్‌లో ప్రశ్నించారు. వసతిగృహంలో 65 మందికి 15 మంది ఉన్నారని వార్డెన్ శ్రీదేవి తెలియజేయగా, తనిఖీలో కేవలం 10 మంది విద్యార్థులే ఉండడంతో మిగిలినవారు ఎక్కడికెళ్లారంటూ సీరియస్ అయ్యారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థుల సంఖ్య తెలియకపోవడం విచారకరమన్నారు. పూసపాటిరేగ కళాశాల వసతిగృహంలో 90 మందికి కేవలం13 మంది విద్యార్థులే ఉండడంతో మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని వాచ్‌మన్‌ను ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వసతిగృహాలను తనిఖీ చేసినట్లు కమిషన్ సబ్యుడు కాంతారావు తెలియజేశారు.
పూపాటిరేగ కేజీబీవీలో నాసిరకం భోజనం
బీసీ వసతి గృహంలో హాజరు వ్యత్యాసం
కళాశాల వసతిగృహంలో 90
మందికి ఉన్నది 13 మందే..
ఏపీ ఫుడ్‌కమిషన్ సభ్యుడు
కాంతారావు తనిఖీలో వెలుగుచూసిన లోపాలు


