ఈ చిత్రం చూశారా... రాజాం మండలం ఆగూరు పంచాయతీ పరిధిలోని సీతంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గది ఇది. పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులు చదువుతుండగా శుక్రవారం ఒక్కరూ హాజరుకాలేదు. ఇక్కడి రెగ్యులర్ టీచర్ పార్వతి సెలవు పెట్టగా, కంచరాం స్కూల్ నుంచి కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడిని ఇక్కడకు డిప్యుటేషన్‌పై వేశారు. ఆయన స్కూల్‌కు వచ్చినప్పటికీ విద్యార్థులు ఎవరూ రాలేదు. దీంతో ఆయన ఒక్కరే అలా తరగతి గదిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు గడిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీరు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, వాటిపై విద్యార్థులకు ఉన్న ఆసక్తి, అధికారుల అంకితభావానికి ఈ చిత్రమే సజీవసాక్ష్యంగా మారింది. – రాజాం


