
డీఎస్సీలో మరువాడ యువకుడి ప్రతిభ
వంగర: మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన గుంట ప్రసాద్ డీఎస్సీలో ఆరు పోస్టులకు ఎస్సీ కేటగిరీ–2లో అర్హత సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ విభాగాల్లో శ్రీకాకుళం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. జోన్–1లో పీజీటీ ఫిజికల్ సైన్స్‌లో ఫస్ట్ ర్యాంకు, టీజీటీ మ్యాథ్స్‌లో మూడో ర్యాంకు, టీజీటీ ఫిజిక్స్‌లో 2వ ర్యాంకు, టీజీటీ సైన్సులో నాల్గవ ర్యాంకు సాధించాడు. కుమారుడు ఉద్యోగం సాధించడంపై తల్లిదండ్రులు తవిటయ్య, మరియమ్మ సంతోషం వ్యక్తం చేశారు.