
శారీరక చురుకుదనం లేకపోతే సమస్యలు
పార్వతీపురం రూరల్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవన శైలిలో ద్విచక్ర వాహనాలు, కార్లు భాగమైపోవడంతో శారీరక శ్రమ ఉండడం లేదని ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి అన్నారు. శారీరక చురుకుదనం లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. క్విట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ పేరిట ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ కార్యాలయం నుంచి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రతిరోజూ విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటారన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. సైక్లింగ్ చేయడం వల్ల శారీరక దృఢత్వం వస్తుందని చెప్పా రు. ర్యాలీలో ఏఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, ఆర్‌ఎస్సైలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి