
అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదే..
విజయనగరం క్రైమ్: వినాయక ఉత్సవాల్లో అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదేనని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఎక్కడైనా అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంటపాల ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్, ఎలక్ట్రికల్, ఫైర్ శాఖల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాలు సాఫీగా సాగేందుకు పోలీస్ సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మంటపాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత పంచాయతీ, మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు పొందాలన్నారు. ఉత్సవాల్లో డీజేలను వినియోగించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. మైక్‌సెట్‌లను నిర్ణీత సమయం వరకు మాత్రమే వేయాలని చెప్పారు. అలాగే సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనంలో ప్రమాదకర రంగులు చల్లుకోవడం.. బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సభ్యులపై చర్యలు తప్పవన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్