
రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో ద్వితీయ స్థానం దక్కించుకున్న జిల్లా జట్టు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన సబ్ జూనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలికల జట్టు సత్తా చాటింది. ఈ నెల 22, 23 తేదీల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించి 32–34 పాయింట్ల తేడాతో ఓటమి చెంది ద్వితీయ స్థానంలో నిలిచింది. టోర్నీలో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రతిభ కనబరిచిన మజ్జి పావని వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు చేతుల మీదుగా రూ.3వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందుకుంది. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం దక్కించుకున్న బాలికల జట్టును జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.రంగారావు దొర, కెవి.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావు అభినందించారు.