● నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల పింఛన్‌ అందజేత ● నాలుగున్నరేళ్లలో రూ.47.53 కోట్ల అందజేత ● జిల్లాలో 1375 మంది లబ్ధిదారులు ● దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్‌ సర్కార్‌ పింఛన్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

● నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల పింఛన్‌ అందజేత ● నాలుగున్నరేళ్లలో రూ.47.53 కోట్ల అందజేత ● జిల్లాలో 1375 మంది లబ్ధిదారులు ● దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్‌ సర్కార్‌ పింఛన్‌ పంపిణీ

Published Mon, Dec 4 2023 12:34 AM | Last Updated on Mon, Dec 4 2023 12:34 AM

- - Sakshi

విజయనగరం ఫోర్ట్‌:

వీరు ముగ్గురికే కాదు... వేలాది మందికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధుల పింఛన్‌ లు అందజేస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్ర మే ప్రభుత్వం కుష్టు, ఫైలేరియా, కిడ్నీ వ్యాధులు, పక్షవాతం, మంచానికే పరిమితం అయిన వారు, సికిల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా హిమోఫిలి యా వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రభుత్వం అండగా ఉంటూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల గురించి అలోచించిన దాఖలాలు లేవు. దీంతో ఆయా వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి బాధితులు వేలల్లో ఖర్చు చేసేవారు.

ఇటువంటి పరిస్థితి నుంచి వారికి అండగా నిలవాల ని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి నెలా పింఛన్‌ ఇస్తున్నారు. రూ. 5 వేలు, రూ.10 వేలు చొప్పున ప్రతి నెలా పింఛన్‌ అందజేస్తున్నారు.

వ్యాధి నిర్ధారణ పత్రం ఆధారంగా..

సంబంధిత వ్యాధి నిర్ధారణకు సంబంధించి ప్రభు త్వం లేబొరేటరీ, వైద్యులు ఇచ్చిన నిర్ధారణ పత్రా న్ని పీహెచ్‌సీ వైద్యుడు పరిశీలించి డీఎంహెచ్‌ఓకు పంపిస్తారు. డీఎంహెచ్‌ఓ వాటిని పరిశీలించి మంజూరు కొరకు ప్రభుత్వానికి పంపిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో పింఛన్లు అందుకున్న వారు జిల్లాలో 1375 మంది ఉన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల మాదిరి ప్రతి నెల ప్రభుత్వం పింఛన్‌ అందజేస్తోంది. ఒక్క కుష్టు వ్యాధిగ్రస్తులకు మాత్రమే రూ.3 వేలు పింఛన్‌ అందిస్తున్నారు. ఫైలేరియా (రెండు కాళ్లకు) ఉన్న వారికి రూ.5 వే లు, క్రానిక్‌ కిడ్నీ ఉన్న వారికి రూ.10 వేలు, కిడ్నీ, గుండె, లివర్‌ మార్పిడి జరిగిన వారికి రూ.5 వేలు, పక్షవా తంతో వీల్‌చైర్‌లో ఉన్న వారికి రూ.5 వేలు, హిమోఫిలియా, సికెల్‌సెల్‌ ఎనీమియా, తలసేమియా రోగులకు రూ.10 వేలు, రోడ్డు ప్రమాదా ల్లో గాయపడి మంచానికే పరిమితం అయిన వారికి రూ.5 వేలు పింఛన్‌ ప్రభుత్వం అందిస్తోంది.

గొప్ప విషయం

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పింఛన్లు ఇవ్వడం గొప్ప విషయం. ఇది ఎంతగానో వారికి ఉపయోగపడుతుంది. ఆయా వ్యాధులతో బాధపడే వారికి మందులకు ప్రతి నెల రూ.వేలలో ఖర్చు అవుతుంది. ఈ పింఛన్‌ వారి వైద్యానికి ఉపయోగించుకుంటారు. – డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌ఓ

No comments yet. Be the first to comment!
Add a comment
1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement