డాబాగార్డెన్స్: హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధి అనకాపల్లి గేట్ విద్యుత్ స్తంభం వీపీఏ/ఎంఎన్/87 సమీపాన ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహాన్ని హార్బర్ పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని, అనకాపల్లి గేట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించే వాడని, మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉండేవాడని, అనారోగ్యంతో మరణించి ఉండవచ్చని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు హార్బర్ సీఐ కె.మల్లేశ్వరరావును 9440796013కు సంప్రదించాలని కోరారు.
నేడు, రేపు ఆర్టీఐ కమిషనర్ పర్యటన


