పనులు నాణ్యతగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పనులు నాణ్యతగా చేపట్టాలి

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

తాటిచెట్లపాలెం: రైల్వేశాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) సందీప్‌ మాధుర్‌ అధికారులకు, సిబ్బందికి సూచించారు. విశాఖపట్నం–కంటకాపల్లి సెక్షన్‌ల మధ్య బుధవారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న భద్రత, అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఆధునికీకరిస్తున్న విజయనగరం స్టేషన్‌ స్థితిగతులను, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విజయనగరం, కంటకాపల్లి బొబ్బిలి స్టేషన్‌లలో పర్యటించి స్టేషన్‌ యార్డ్‌, సైడింగ్‌ పనులను, గొట్లాం–నెల్లిమర్ల బైపాస్‌ రైల్వే లైన్‌ పనులను సమీక్షించారు. కంటకాపల్లి స్టేషన్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రతినిధుల బృందంతో ప్రాజెక్ట్‌ పురోగతి, ఇతర విషయాలపై చర్చించారు. బొబ్బిలిలో నూతనంగా నిర్మించిన మహిళా సిబ్బంది రెస్ట్‌ రూంను జీఎం ప్రారంభించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు విశాఖపట్నం డివిజన్‌ డీఆర్‌ఎం లలిత్‌బోహ్ర, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎస్‌కే రాజ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికం ఇంజినీర్‌ ఒ.బి.సురేష్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వినీత్‌కుమార్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అంకుష్‌గుప్తా, విశాఖపట్నం డివిజన్‌ సీనియర్‌ అధికారుల పాల్గొన్నారు.

సౌత్‌కోస్ట్‌ రైల్వే జీఎం సందీప్‌ మాధుర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement