కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ● కార్పొరేటర్‌ అభ్యర్థులు, బూత్‌ ఏజెంట్లతో సమావేశం

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి సూచించారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్‌ అభ్యర్థులు, పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నిబంధనలపై సూచనలు చేశారు.ప్రతి ఓటును నిశితంగా పరిశీలించాలని, ఏవైనా పొరపాట్లు జరిగితే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. కౌంటింగ్‌ ఏజెంట్లు గుర్తింపు కార్డులు, అనుమతి పత్రాలతో నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. బ్యాలెట్‌ బాక్సుల సీల్స్‌ను లెక్కింపు ప్రారంభానికి ముందే పరిశీలించాలని, అనుమానాలు ఉంటే రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతి రౌండ్‌లో నమోదైన ఓట్ల వివరాలను సరిపోల్చుకోవాలని, చెల్లుబాటు అయ్యే ఓట్లపై అభ్యంతరాలు, ఓట్ల లెక్కింపులో తేడాలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. అవసరమైతే రీకౌంటింగ్‌ కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిబంధనలు పాటిస్తూ సంయమనంతో వ్యవహరించాలని, అధికారిక ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేయవద్దని సూచించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, తైనాల విజయ్‌కుమార్‌, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణికుమారి, పీలా వెంకటలక్ష్మి, పీలా ఉమారాణి, మువ్వల సురేష్‌, పాల్‌ విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement