జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

మహారాణిపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ జి. విద్యాధరితో కలిసి ఆర్డీఓలు, రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ నెల 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, ప్రతి కేంద్రంలో కనీస సదుపాయాలు, క్రిటికల్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి పోలింగ్‌ సరళిని పర్యవేక్షించాలని, ఎన్నికల సామగ్రి, సిబ్బంది శిక్షణ, రవాణా, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌వో ఎం. విశ్వేశ్వర నాయుడు, ఆర్డీఓలు దిలీప్‌ చక్రవర్తి, సంగీత్‌ మాధుర్‌, ఎన్నికల అధికారులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement