ఎమ్మెల్యే పంచకర్లపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పంచకర్లపై చర్యలు తీసుకోవాలి

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

పెందుర్తి: దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుపై ఎన్నికల కమిషన్‌ వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు.రాంపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధి దొంగ ఓటు వేస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదే తప్పు సామాన్యుడు లేదా వైఎస్సార్‌సీపీ కార్యకర్త చేసి ఉంటే ఇదే విధంగా వ్యవహరించేవారా అని నిలదీశారు.ఎమ్మెల్యేకు సహకరించిన పోలింగ్‌ అధికారులు, ఇతర సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న పరిషత్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement