ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ఎన్నికల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల పరిశీలకుడు ఎ.భార్గవతేజ, వ్యయ పరిశీలకుడు పి.వెంకట సందీప్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో చేపట్టిన ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఛాంబర్‌లో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలను వివరించారు. అనంతరం పరిశీలకులు మేయర్‌ రిటర్నింగ్‌ అధికారి గదిని సందర్శించి, అక్కడ జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.

వ్యయ పరిమితి దాటితే చర్యలు

ఎన్నికల్లో వ్యయ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వ్యయ పరిశీలకుడు పి.వెంకట సందీప్‌రెడ్డి స్పష్టం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం 21 ఎన్నికల సర్కిళ్ల అసిస్టెంట్‌ ఎక్స్‌పెండిచర్‌ అబ్జర్వర్లతో నిర్వహించిన సమీక్షలో ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, లెక్కల నమోదు, నిబంధనల అమలుపై దిశానిర్దేశం చేశారు. కార్పొరేటర్‌ అభ్యర్థులు గరిష్టంగా రూ.15 లక్షలు, మేయర్‌ అభ్యర్థులు రూ.40 లక్షల వరకు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాలని తెలిపారు. నగదు, మద్యం, బహుమతుల పంపిణీతో పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రకాల ఖర్చులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో జీవీఎంసీ వ్యయ పర్యవేక్షణ నోడల్‌ అధికారి, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement