కనకమహాలక్ష్మికి లక్ష గాజులతో పూజలు | - | Sakshi
Sakshi News home page

కనకమహాలక్ష్మికి లక్ష గాజులతో పూజలు

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

డాబాగార్డెన్స్‌: శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం కనకమహాలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి లక్ష గాజులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరానికి చెందిన ఓ ప్రముఖ సంఘ సేవకుడు అలంకరణకు సహకరించారు. అమ్మవారి అలంకరణకు అవసరమైన పట్టు వస్త్రాలను లక్కీ షాపింగ్‌మాల్‌, సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ అందజేశాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. సోమవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనుండగా, శాకాంబరిగా కూరగాయలతో సహస్రనామార్చన నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement