మహారాణిపేట: పండగ సీజన్ సందర్భంగా గృహ, వాహన రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను మాఫీ చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఆ బ్యాంకు విశాఖ ప్రాంతీయ కార్యాలయ అధికారి జె. సింహాచలం తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన వినియోగదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకుని బ్యాంకు అందిస్తున్న గృహ, వాహన రుణాలను పొందాలని ఆయన కోరారు. పండగ సీజన్ సందర్భంగా బ్యాంకు అందిస్తున్న ప్రత్యేక ప్రయోజనాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని సింహాచలం సూచించారు.


