జాతీయ పతాకానికి అవమానం! | - | Sakshi
Sakshi News home page

జాతీయ పతాకానికి అవమానం!

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

కొమ్మాది: జనసైనికులు జాతీయ పతాకాన్ని అవమానించారు. దేశ ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని పార్టీ జెండాతో పాటు ప్రదర్శించి అత్యుత్సాహం ప్రదర్శించారు. జీవీఎంసీ 11వ వార్డు జనసేన పార్టీ అభ్యర్థి శాకరి శ్రీనివాస్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఎండాడలోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా జనసైనికులు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ జెండాతో పాటు జాతీయ పతాకాన్ని కూడా ప్రదర్శించారు. రాజకీయ ఆర్భాటంలో జాతీయ పతాకం గౌరవానికి భంగం కలిగించడంపై పలువురు సీనియర్‌ సిటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పార్టీ జెండాతో పాటు త్రివర్ణ పతాకం ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement