పలు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

పలు ప్రత్యేక రైళ్లు

Oct 18 2026 1:42 AM | Updated on Oct 18 2026 1:42 AM

తాటిచెట్లపాలెం: పండుగల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–నహర్‌లాగున్‌ (07046, 07047) ప్రత్యేక రైళ్లను నవంబరు 27, 30వ తేదీల వరకు నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

పలు రైళ్ల గమ్యం కుదింపు

ఖుర్దారోడ్‌ డివిజన్‌లోని పూరీ రైల్వేస్టేషన్‌ పరిధిలో భద్రతా పనుల కారణంగా తిరుపతి–పూరీ (17480), పూరీ–తిరుపతి (17479) రైళ్లను జనవరి 11 వరకు మాలతిపత్‌పూర్‌ వరకే నడపనున్నారు. గాంధీదాం–పూరీ (22973), పూరీ–గాంధీదాం ప్రత్యేక రైళ్లను కూడా నిర్ణీత తేదీల వరకు మాలతిపత్‌పూర్‌ నుంచే రాకపోకలు సాగించేలా మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement