భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్–19 జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ(54)తో రాణించాడు. వినూ మన్కడ్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో ఓపెనర్‌గా దిగాడు. తొలి వికెట్‌కు 145 పరుగులు జోడించడంలో సహకరించాడు. జట్టును సమర్థవంతంగా నడిపించి కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాడు.
ఇలా మొదలైంది...
సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో జరిగిన యూత్ వన్డేతో భారత్ అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా 28, 47, 34 పరుగులతో రాణించాడు. అంతకు ముందు ఢీల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరపున ఆడాడు. ఆర్యవీర్ తన తండ్రి పేరుతో తనకు ఒత్తిడి లేదంటూనే విశాఖలో ఆడుతూ నాయకత్వ భాద్యతలోనూ తన శైలి ప్రదర్శించాడు. భారీ పరుగులు చేయాలంటే ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవాలని తెలిపాడు.


