మద్దిలపాలెం: ప్రపంచంలో ప్రతిష్టాత్మక, పురాతన వైద్య సంస్థల్లో ఒకటైన ‘రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్(ఆర్‌ఎస్‌ఎం)’తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ‘వాయిసెస్ ఆఫ్ ఆర్‌ఎస్‌ఎం’సిరీస్‌లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, ఆర్‌ఎస్‌ఎం ఫెలో డాక్టర్ దేవా హెచ్.పురాణాన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆర్‌ఎస్‌ఎం.. వైద్య విద్య, బహుళ విభాగాల సహకారం, 70కి పైగా వైద్య విభాగాల్లో ఆరోగ్య సంరక్షణ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. క్లినికల్ ట్రైనింగ్, ఆవిష్కరణలు, పరస్పర సహకారంతో కూడిన ఈ సంస్థ.. తన వృత్తిపరమైన అభివృద్ధి, నాయకత్వ ప్రయాణంలో ఎలాంటి కీలక పాత్ర పోషించిందో డాక్టర్ పురాణం పంచుకున్న అభిప్రాయాలను ఆర్‌ఎస్‌ఎం ఈ సందర్భంగా హైలెట్ చేసింది. లైఫ్ సైన్సెస్, రెగ్యులేటరీ స్ట్రాటజీ, హెల్త్‌కేర్ లీడర్‌షిప్‌లో అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్ పురాణంనకు విశేష అనుభవం ఉంది.


