డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీకి 43 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ ఈపీడీసీఎల్‌ సీఎండీకి 43 ఫిర్యాదులు

Mar 3 2026 7:19 AM | Updated on Mar 3 2026 7:19 AM

విశాఖ సిటీ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ’ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి వినియోగదారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రధానంగా విద్యుత్‌ సరఫరాకు సంబంధించి లో–వోల్టేజ్‌, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, రూఫ్‌ టాప్‌ సోలార్‌, విద్యుత్‌ లైన్ల మార్పు, విద్యుత్‌ బిల్లులు, విద్యుత్‌ స్తంభాల మధ్య వైర్లు వేలాడుతుండడం, సిబ్బంది కొరత, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. వినియోగదారులు విద్యుత్‌ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు కాల్‌ చేయడం లేదా వాట్సాప్‌ నంబరు 9493681912కు చాట్‌ చేయడం ద్వారా కూడా విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సీఎండీ సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement