● కాన్వాస్‌పై ప్రకృతి సోయగాలు
జూలో ఉత్సాహంగా చిత్ర లేఖన పోటీలు
ఆరిలోవ: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ జూ పార్కులో ఆదివారం నిర్వహించిన చిత్రలేఖన పోటీలు ఉత్సాహంగా సాగాయి. జూ బయోస్కోప్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో ఒకటో తరగతి నుంచి పీజీ చదువుతున్న విద్యార్థులు పలు విభాగాల్లో పాల్గొన్నారు. రంగుల కుంచెలతో ప్రకృతి అందాలకు, తమ ఆలోచనలకు కాన్వాస్‌పై ప్రాణం పోశారు. ‘ఔషధ, సుగంధ మొక్కలు–ఆరోగ్యం, వారసత్వం–జీవనోపాధి పరిరక్షణ’ అనే ప్రధానాంశంతో ఈ పోటీలను నిర్వహించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల చిత్రాలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారని, ఈ నెల 3న విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
● కాన్వాస్‌పై ప్రకృతి సోయగాలు
● కాన్వాస్‌పై ప్రకృతి సోయగాలు
● కాన్వాస్‌పై ప్రకృతి సోయగాలు


