కుమారుడు చేతుల మీదుగా సత్కారం
ఉప్పొంగిన మాతృహృదయం
భీమునిపట్నం: భీమిలిలో ఆదివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఒక అరుదైన, ఆత్మీ య సంఘటనకు వేదికై ంది. ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుండటంతో, ఇది వారికి ఆఖరి సమావేశం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భీమిలి ఎంపీపీ దంతులూరి వాసురాజు మండలంలోని సర్పంచ్‌లందరినీ ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో అమనాం సర్పంచ్‌గా ఉన్న తన తల్లి దంతులూరి ఉమాదేవిని, ఎంపీపీ హోదాలో ఉన్న ఆమె కుమారుడు వాసురాజు శాలువాతో సత్కరించి గౌరవించారు. కుమారుడు ఉన్నత పదవిలో ఉండి, తనను సత్కరించడం పట్ల తల్లి ఉమాదేవి భావోద్వేగానికి గురయ్యారు.


