సెలబ్రిటీ క్రికెట్ ధమాకా
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ స్టేడియంలో శనివారం టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (టీసీసీఎల్) ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఎన్‌ఎం స్పేసెస్, పోలీస్ వారియర్స్ జట్లు ఘనవిజయాలు సాధించాయి. తొలి మ్యాచ్‌లో ఎన్‌ఎం స్పేసెస్ జట్టు 69 పరుగుల తేడాతో టీవీ టైగర్స్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్‌ఎం స్పేసెస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. రామ్ పాటిల్ (90) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీవీ టైగర్స్ 154 పరుగులకే కుప్పకూలింది. రెండో మ్యాచ్‌లో పోలీస్ వారియర్స్ 7 వికెట్ల తేడాతో టీవీ కింగ్స్‌ను ఓడించింది. టీవీ కింగ్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని పోలీస్ వారియర్స్ సులభంగా ఛేదించింది. త్రినాథ్ (92 నాటౌట్), అరుణ్ (56) అద్భుత భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రారంభమైన మూడో మ్యాచ్‌లో పొలిటికల్ టీమ్‌తో టాలీవుడ్ క్రికెట్ ఎలెవెన్ తలపడింది. అఖిల్ నాయకత్వంలోని టీసీఏ జట్టులో శ్రీకాంత్, సుధీర్ బాబు, తమన్ తదితరులు ఉన్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఆదివారంతో ముగియనుంది.
ఉత్సాహంగా సాగిన టీసీసీఎల్
ట్రోఫీని ఆవిష్కరిస్తున్న బుల్లితెర నటులు
మైదానంలో బుల్లి తెర నటులు
సెలబ్రిటీ క్రికెట్ ధమాకా


