ముకుంద జ్యూవెలరీ 10వ బ్రాంచ్ ప్రారంభం
మహారాణిపేట: బంగారం ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యూవెలరీ’ షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. శనివారం సిరిపురం జంక్షన్‌లోని సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో ఉన్న ఎంవీఆర్ బిల్డింగ్ మూడో అంతస్తులో ముకుంద జ్యూవెలరీ 10వ బ్రాంచ్‌ను సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, సీఈవో నికితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ తమ స్టోర్‌లో అద్భుతమైన కలెక్షన్లు, ప్రత్యేకమైన డిజైన్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డైమండ్, బంగారం, వెండి ఆభరణాల విభిన్న శ్రేణులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు కృష్ణ, నాని, రమ, బృంద తదితరులు పాల్గొన్నారు.


