గోరంత చిత్రంతో కొండంత ఘనత
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సిద్ధేశ్వరం కుర్రాడు
పెదగంట్యాడ: కళకు హద్దులు లేవని, పట్టుదల ఉంటే అరచేతిలో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు సిద్ధేశ్వరానికి చెందిన ద్వారపూడి సాయి. కేవలం 1.2 సెంటీమీటర్ల పరిమాణంలో భారత దిగ్గజం రతన్ టాటా చిత్రాన్ని గీసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నాడు. వృత్తిరీత్యా కార్పెంటర్ అ యిన ఈశ్వరరావు చిన్న కుమారుడు సాయికి చిన్నప్పటి నుంచే చిత్రకళపై మక్కువ. తన ప్రతిభకు పదును పెడుతూ, కేవలం 6 నిమిషాల వ్యవధిలో, 1.5 సెం.మీ పొడవు, 1.2 సెం.మీ వెడల్పు ఉన్న అతి చిన్న కాగితంపై పెన్సిల్‌తో రతన్ టాటా ముఖచిత్రాన్ని అత్యంత స్పష్టంగా గీశాడు. సాయి ప్రతిభను గుర్తిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
గోరంత చిత్రంతో కొండంత ఘనత


