ఆనందం.. ఆత్మీయత.. ఆవేదన
7వ పేజీ తరువాయి
విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన అజెండా చర్చ రాత్రి 8 గంటల వరకు సాగింది. ఈ సమావేశంలో మొత్తం 37 అజెండా అంశాలతో పాటు మరో 30 టేబుల్ అంశాలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది.
ఆటలొద్దు.. టూర్‌కే వెళ్దాం
చివరి కౌన్సిల్‌లో మహిళా కార్పొరేటర్లు పార్టీలకతీతంగా ఏకమయ్యారు. ఐదేళ్లుగా సభలో ప్రజాసమస్యలపై గొంతెత్తిన వీరంతా ఆఖరి రోజున చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలు పంచుకున్నారు. ముగింపు సందర్భంగా మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిద్దామన్న మేయర్ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. తమకు ఆటలు వద్దని, అందరినీ టూర్‌కు తీసుకెళ్లాలని పట్టుబడుతూ మేయర్ పోడియంను చుట్టుముట్టారు. జీరో అవర్ జరుగుతున్నా.. వినకుండా కమిషనర్ కేతన్‌గార్గ్‌కు వినతిపత్రం అందజేశారు. ఉన్నత చదువులు చదివిన అధికారుల ముందు, పెద్దల ముందు కూర్చుని మాట్లాడే స్థాయికి తాము చేరడానికి తమ భర్తల సహకారం మరువలేనిదని బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత గుర్తు చేయగా.. మిగిలిన మహిళా సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలుకుతూ తమ భర్తలకు, ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


