సంక్రాంతి.. సంస్కృతికి ప్రతీక
మద్దిలపాలెం: పాతను వదిలి కొత్తను ఆహ్వానించే సంక్రాంతి మన వేద సంస్కృతికి నిదర్శమని.. పాశ్చాత్య జీవన శైలిని వదిలి మన భారతీయ జీవన శైలిని అలవర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ‘మహా సంక్రాంతి’ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ సంక్రాంతి కేవలం పండగ మాత్రమే కాదని, అది తెలుగు రైతుల జీవనరేఖ అని కొనియాడారు. వ్యవసాయం వైపు యువతను మరలిద్దాం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెంచి, రసాయనాల వాడకాన్ని విడనాడుదాం.. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పుల కోసం ప్రయత్ని ద్దామని పిలుపు నిచ్చారు. మాతృభాష కంటి చూపు వంటిదని, పరాయి భాష కేవలం కళ్లజోడు వంటిదని వ్యాఖ్యానించారు. భారత ఎగుమతులపై 500 శాతం సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి స్వయం సమృద్ధి కార్యక్రమాలే సరైన మార్గమని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వకారణమని అన్నారు. మాజీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఏయూ వీసీ రాజశేఖర్, ఎస్‌బీఐ డీజీఎం రాహుల్ సంకృతియ పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సంక్రాంతి.. సంస్కృతికి ప్రతీక
సంక్రాంతి.. సంస్కృతికి ప్రతీక


