
రికవరీ మొబైల్స్ అప్పగింత
తాటిచెట్లపాలెం : ప్రయాణికులు వివిధ రైళ్లలో, రైల్వేస్టేషన్లలో పోగొట్టుకున్న, మరచిపోయిన మొబైల్ ఫోన్స్‌ను గురువారం విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీసులు అందజేశారు. రైల్వేస్టేషన్‌లో గల గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ వద్ద సుమారు 25 లక్షలు విలువైన మొత్తం 100 ఫోన్లను సంబంధిత ప్రయాణికులకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీసు పి.రామచంద్రరావు సూచనలతో జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సిహెచ్.ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో జీఆర్పీ ఎస్‌ఐలు లక్ష్మి, ఎస్.రామారావు, విశాఖ క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎల్.ఉదయ్‌భాస్కర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.