
అనారోగ్యం
తిన్నోళ్లకు తిన్నంత
● తనిఖీలు, పరీక్షలు లేకపోవడంతో విచ్చల వీడిగా కల్తీ ఆహారం అమ్మకాలు
● మూలకు చేరిన మొబైల్ ఆహార పరీక్షల వాహనం
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఆహార తనిఖీలు, పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బంది లేకపోవటంతో జిల్లాలో కల్తీ ఆహారం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. రెండు వారాల క్రితం నగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రై వ్‌లో ఆహార కల్తీలను చూసి అధికారులకు దిమ్మతిరిగింది. రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో 85 శాతం కల్తీ ఆహారమే గుర్తించి అశ్చర్యపోయారు. పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీలు కూడా కల్తీ ఆహారం విక్రయాలు జరుపుతోంది. ఆహార నాణ్యత పాటించకపోవడాన్ని గుర్తించారు. జిల్లాలో సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆహార కల్తీని ఆరికట్టే అవకాశం ఉంటుంది.
నిరుపయోగంగా కోట్ల విలువైన పరికరాలు
ప్రజారోగ్యం కోసం గత ప్రభుత్వం సుమారు
రూ. 110 కోట్లు కేటాయించి, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రవ్యాప్తంగా మూడు ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో అత్యాధునిక రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రాన్ని నిర్మించి, సుమారు రూ. 10 కోట్ల విలువైన పరికరాలను ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన ఈ కేంద్రానికి 70 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ పోస్టుల భర్తీని చేపట్టకపోవడంతో కోట్ల విలువైన పరికరాలు నిరుపయోగంగా
మూలకు చేరాయి.
బీచ్‌రోడ్డు: ఆహార భద్రత సూచికలో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో కొనసాగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. క్షేత్ర స్థాయిలో నిఘా, పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాల్లోని ఆహార తనిఖీ కార్యాలయాలు, పరీక్షా కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో కల్తీ ఆహారం విచ్చలవిడిగా అమ్ముడవుతోంది. ఇటీవల జరిగిన తనిఖీల్లో 85 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో నాసిరకం, కల్తీ ఆహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోంది.
ప్రాంతీయ కేంద్రాల్లో సిబ్బంది కొరత
జిల్లాలో ఆహార భద్రతా వ్యవస్థ సంక్షోభంలో ఉంది. పెదవాల్తేరులోని జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అవగాహన కార్యక్రమాలు, రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు సరిపడా లేరు. అంతేకాకుండా, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ వంటి కీలక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. పెదవాల్తేరులోని ప్రాంతీయ ఆహార పరీక్షల కేంద్రంలో ఎప్పటి నుంచో ఆహార పరీక్షలు నిలిచిపోయాయి. గత నెల వరకు జరుగుతున్న నీటి పరీక్షలు కూడా సిబ్బంది బదిలీ కావడంతో ఆగిపోయాయి. ఫలితంగా ఆ కేంద్రం నిరుపయోగంగా మారింది.
రాష్ట్ర ఆహార పరీక్షల కేంద్రం
మొబైల్ ఆహార పరీక్షల వాహనం
అయినా పట్టని ‘ఫుడ్‌సేఫ్టీ’ ఆహార తనిఖీ కేంద్రంలో సిబ్బంది కొరత
నగరంలో
విచ్చలవిడిగా కల్తీ ఆహారం
మూలకు చేరిన వాహనం
గత ప్రభుత్వం కల్తీపై నిఘా పెట్టేందుకు రూ. 40 లక్షలతో కేటాయించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ మొబైల్ టెస్టింగ్ వాహనం కూడా కార్యాలయానికే పరిమితమైంది. ఈ వాహనంతో అవగాహన కల్పించడం కానీ, కల్తీ ఆహార నమూనాలను సేకరించడం కానీ జరగడం లేదు. దీనివల్ల రూ. 40 లక్షలు వృథాగా పోతున్నాయి.

అనారోగ్యం

అనారోగ్యం

అనారోగ్యం

అనారోగ్యం

అనారోగ్యం

అనారోగ్యం