స్ప్రీతో కార్మికుల జీవితాలకు
తాటిచెట్లపాలెం: కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు చెందిన కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ)లో అర్హులైన సంస్థలు, కర్మాగారాలు తమను తాము నమోదు చేసుకోవాలని విశాఖ ఈఎస్‌ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ (ఇన్‌చార్జి) సౌమేంద్ర కుమార్ సాహూ తెలిపారు. నరసింహనగర్‌లోని ఈఎస్‌ఐ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
గత బకాయిల నుంచి మినహాయింపు
సాధారణంగా ఈఎస్‌ఐలో నమోదు చేసుకున్న సంస్థలు గత ఐదేళ్ల బకాయిలు, వడ్డీ, నష్టపరిహారంతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ పథకం ద్వారా నమోదు చేసుకుంటే ఈ భారం నుంచి మినహాయింపు పొందొచ్చు.
పాత బకాయిలు, తనిఖీలు ఉండవు
ఈ పథకంలో నమోదు చేసుకున్న తేదీ కంటే ముందు సమయానికి సంబంధించిన చందాలు కట్టనవసరం లేదు. అలాగే ఈఎస్‌ఐ కూడా గత సమయానికి సంబంధించిన క్లెయిములు, తనిఖీలు చేయదు.
నమోదుకాని ఉద్యోగుల నమోదు
ఇప్పటికే ఈఎస్‌ఐలో నమోదు చేసుకుని, ఇంకా కొంతమంది ఉద్యోగులను నమోదు చేయని సంస్థలు ఈ పథకం ద్వారా వారిని చేర్చుకోవచ్చు. వారికి కూడా నమోదు చేసిన తేదీ నుంచి చందా, ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఈఎస్‌ఐ పరిధి, ప్రయోజనాలు
కార్మిక రాజ్య బీమా సంస్థ అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 22.24 లక్షల కర్మాగారాలు, సంస్థలు ఈ పథకం కింద నమోదయ్యాయి, వీటిలో
3.72 కోట్ల కార్మికులు ఉన్నారు.
ఎవరెవరికి లాభం
వర్క్‌మెన్ కాంపెన్సేషన్ చట్టం, 1923, మెటర్నిటీ చట్టం, 1961 నుంచి మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగుల వైద్య ఖర్చుల బాధ్యత నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్య భద్రత లభిస్తుంది. అనారోగ్యం, ప్రసవం, ఉద్యోగ సంబంధిత ప్రమాదాలు, వైకల్యం వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం అందుతుంది.
నమోదు చేసుకోని సంస్థలకు సువర్ణావకాశం ఈఎస్‌ఐసీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌కే సాహూ
ప్రయోజనాలు
ఎవరు అర్హులు?
10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ఏ కర్మాగారాలు లేదా సంస్థలైనా ఈఎస్‌ఐ చట్ట పరిధిలోకి వస్తాయి. వీటిలో సినిమా హాళ్లు, రవాణా సంస్థలు, ప్రింటింగ్ ప్రె స్‌లు, వార్తా సంస్థలు, హో టళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రు లు, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ ఏజెన్సీలు మొదలైనవి ఉంటాయి.
ఈఎస్‌ఐ చట్ట పరిధిలో ఉన్నప్పటికీ, ఇంతవరకు నమోదు చేసుకోని సంస్థల కోసం ‘స్కీం ఫర్ ప్రమోషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్’(స్ప్రీ) పథకాన్ని ఈఎస్‌ఐ తిరిగి ప్రారంభించింది. ఈ పథకం జూలై 1, 2025 నుంచి డిసెంబరు 31, 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం కింద నమోదు చేసుకునే సంస్థలకు గత బకాయిల నుంచి మినహాయింపు లభిస్తుంది.
చందా వివరాలు
నెలసరి వేతనం రూ. 21,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న కార్మికులకు ఈఎస్‌ఐ వర్తిస్తుంది. దివ్యాంగులకు ఈ పరిమితి రూ. 25,000. కార్మికుల వాటా మొత్తం వేతనంపై 0.75 శాతం ఉంటుంది. మొత్తం వేతనంపై 3.25 శాతం ఉంటుంది. ఈ రెండు వాటాలను కలిపి ప్రతి నెలా 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రూ. 176 లేదా అంతకంటే తక్కువ దినసరి వేతనం పొందే కార్మికులకు చందా మినహాయింపు ఉంటుంది, కానీ యజమాని వాటా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం నరసింహనగర్‌లోని ఉప ప్రాంతీయ కార్యాలయాన్ని లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1800–11–2526ను సంప్రదించవచ్చు.
మరింత ధీమా