
యువతికి ఆశ్రయం
అల్లిపురం: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఒంటరిగా ఉన్న ఓ యువతిని ఆకతాయిల వేధింపుల నుంచి ఏయూటీడీ సిబ్బంది రక్షించారు. రాజాంకు చెందిన నాగవల్లి చిన్నప్పుడే తల్లిదండ్రులను కో ల్పోయింది. దీంతో ఆమె అమ్మమ్మ నాగవల్లిని కస్తూర్బా ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ ఇంటర్ వరకు మాత్రమే ఉంది. దీంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నాగవల్లిని, ఆశ్రమం నుంచి బయటకు పంపించారు. దీంతో నగరంలోని ఒక స్నేహితురాలి ఇంట్లో ఒక నెల రోజులు ఉంది. ఆమెకు పెళ్లి కావడంతో అక్కడి నుంచి కూడా బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తలదాచుకుంది. అక్కడ కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా.. కానిస్టేబుల్ నూకరాజును ఆశ్రయించింది. దీంతో ఆయన ఆమెను టీఎస్సార్ కాంప్లెక్స్ షెల్టర్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ యువతికి మహిళల వసతి గృహంలో ఆశ్రయం కల్పించినట్లు ఏయూటీడీ కార్యదర్శి ప్రగడ వాసు తెలిపారు.