
డిఫెన్స్ మద్యం స్వాధీనం
మర్రిపాలెం: మురళీనగర్‌లోని గోపాలపట్నం ఎకై ్సజ్ స్టేషన్ అధికారులు 24 డిఫెన్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో నివాసముంటున్న ముదపాక శ్రీనివాస్ అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం అధికారులు దాడులు చేశారు. శ్రీనివాస్ ఇంట్లో 24 మద్యం సీసాలు లభ్యం కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ కరుణలత, సిబ్బంది పాల్గొన్నారు.