
ఇంటర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అప్పారావు
మద్దిలపాలెం: విశాఖ ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. జి.వి.అప్పారావు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.రామారావు ఉపాధ్యక్షుడిగా, బి.సి.హెచ్.సుధాకర్ కార్యదర్శిగా, కె.జగదీశ్వరరావు సంయుక్త కార్యదర్శిగా, బి.సుశీల మహిళా కార్యదర్శిగా, ఎన్.మురళీమోహన్ కోశాధికారిగా, కె.సిహెచ్.నాయుడు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎం.దుర్గాప్రసాద్, ఎన్.గీతాకుమారి, బి.పుష్పకుమార్, సంతోష్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి రవిశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.అప్పలరాజు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సంఘం సేవలందించనుందని నూతన అధ్యక్షుడు జి.వి.అప్పారావు తెలిపారు.