
యువకులను కాపాడిన లైఫ్‌గార్డులు
కొమ్మాది: రుషికొండ బీచ్‌లో ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను లైఫ్‌గార్డ్స్ కాపాడారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు ఆదివారం మధ్యాహ్నం బీచ్‌కు వచ్చారు. స్నానం చేయడానికి సముద్రంలోకి దిగిన సమయంలో.. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిలో శ్రీజిత్ జ్ఞాన్, బి.సర్కార్ అనే ఇద్దరు యువకులు లోపలికి కొట్టుకుపోయారు. అక్కడ విధుల్లో ఉన్న లైఫ్‌గార్డ్స్ ఎస్.నూకరాజు, ఎం.అమ్మోరు, చిన్నప్పన్న, చందు, సతీష్, దేవరాజ్ కుమార్ తక్షణమే స్పందించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. పర్యాటకుల ప్రాణాలను కాపాడిన లైఫ్‌గార్డ్స్‌ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు.