
రోడ్డుప్రమాద బాధితుల కోసం సహాయ కేంద్రం ఏర్పాటు
విశాఖ లీగల్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించే విధంగా విశాఖ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరు 7995095793లో సంప్రదించవచ్చన్నారు. ప్రమాదాలకు గురైన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఎఫ్‌ఐఆర్, పోస్ట్‌మార్టం నివేదిక, శవ పంచనామా నివేదిక, వైద్య ధృవీకరణ పత్రాలు, వాహన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర డాక్యుమెంట్లు, మెటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంఏసిటి)లో నష్టపరిహారం కోసం కేసు వేయడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఈ కేంద్రం నుంచి అందించడం జరుగుతుందన్నారు. ఇతర న్యాయపరమైన సేవల కోసం హెల్ప్‌లైన్ నంబరు 15100ను సంప్రదించవచ్చుని తెలిపారు.