
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం
విశాఖ సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కమిటీలో విశాఖ జిల్లా నుంచి ముగ్గురు చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు తెలిపింది. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా చందక అప్పలస్వామి(భీమిలి), కంకల ఈశ్వరరావులను, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా జగ్గుపల్లి నరేష్ (భీమిలి), కోరాడ చంద్రమౌళి(పెందుర్తి)ని నియమించారు.