
పాత ఫొటోతోనే బుకింగ్స్
యాత్రి నివాస్‌ను అధికారికంగా ఇంకా ప్రారంభించనప్పటికీ.. పర్యాటకులు బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో రూమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ఏపీటీడీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం యాత్రి నివాస్‌పై అక్కసు చూపిస్తూనే ఉంది. గత ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దినందున ఆ పేరు దానికి వస్తుందనే ఉద్దేశంతో పనులను ఆలస్యం చేసింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చినా.. పాత ఫొటోనే వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఫొటో చూసి పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. పాత ఫొటో స్థానంలో కొత్తది ఉంచితే బుకింగ్స్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.